ఆధ్యాత్మికం

కొండగట్టులో బేతాళ స్వామి, శ్రీరామ ఆలయాల్లో భక్తుల రద్దీ.. సీతమ్మ కన్నీటి గుంట వద్ద భక్తుల సందడి

కొండగట్టులో బేతాళ స్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు

కొండగట్టు | సెప్టెంబర్ 8:శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టులోని బేతాళ స్వామి, శ్రీరామ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.అదేవిధంగా సీతమ్మ కన్నీటి గుంట వద్ద కూడా భక్తుల సందడి కనిపించింది. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుని పూజలు నిర్వహించారు.

కొండగట్టులో శ్రీరాముడి ఆలయం వద్ద భక్తులు

కొండగట్టులో సీతమ్మ కన్నీటి గుంటల వద్ద భక్తులు

బేతాళ స్వామి ఆలయం, శ్రీరామ ఆలయం, సీతమ్మ కన్నీటి గుంట పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రాకతో కొండగట్టు ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది

👁️ 5 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password