తాజా వార్తలు

జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అరెస్ట్

గన్‌పార్క్ వద్ద జనసేన నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

హైదరాబాద్ | సెప్టెంబర్ 8:జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా గన్‌పార్క్ వద్ద ఉన్న పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.జనసేన పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ దుంపటి శ్రీనివాస్తో పాటు యడమా రాజేష్, పనుతుల జైరామ్, దుర్గాప్రసాద్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, మండపాక కావ్య, అనుపమ కొల్లి, మహేష్, ప్రవీణ్, హరి నాయక్, జైసింహ, కిరణ్, కార్తీక్, కొంగరి సాయి, మాధవ రెడ్డి, గౌతమ్, వెంకట్ రమేష్, వెంకటేష్ ముదిరాజ్, జానీ, ప్రసాద్, ప్రవీణ్ సాహు, దయానంద్, అక్షయ్ కుమార్, కౌశిక్, నల్ల సురేష్ రెడ్డి, బ్రహ్మాజీ పంజా, కేసన త్రిమూర్తులు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి.అలాగే ప్రేమ్ గాంధీ, హైందవి రెడ్డి, మీసాల శ్రీనివాస్ రావు, శ్రీధర్ శర్మ, రాంబాబు పైడిపల్లి, శోభనబాబు, అజయకుమార్, ముజఫర్ అలీ, పద్మజ, వెంకటలక్ష్మి, భవ్య రెడ్డి, రేఖ, సందీప్, వెంకటేష్, విజయ్ కుమార్, రవీంద్ర చౌహాన్, శివ నాగేశ్వర రావు తదితరులు కూడా అరెస్టయినట్లు సమాచారం.అరెస్టు చేసిన వారిని పోలీసులు బేగంబజార్, మెహదీపట్నం తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామంతో గన్‌పార్క్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

👁️ 5 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password