తక్కళ్లపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం

తక్కళ్లపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న బత్తిని శ్రీనివాస్ గౌడ్ తదితరులు
మల్యాల, ఆగస్టు 31: మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామంలో గంపల లావణ్య–స్వామి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారి ఆదేశాల మేరకు మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా గంపల లావణ్య–స్వామి దంపతులకు దుస్తులు కూడా అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంకు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క అనిల్, పాక్స్ డైరెక్టర్ సుల్తాన్ లచ్చన్న, ఏఎంసీ డైరెక్టర్ సాగర్, కాంగ్రెస్ నాయకులు మరాఠి లక్ష్మీనారాయణ, ముత్యాల నర్సింహారెడ్డి, బీవీ రమణతో పాటు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
