ఆధ్యాత్మికం

కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

కొండగట్టు అంజన్న ఆలయంలో స్వామికి నమస్కరిస్తున్న భక్తులు

కొండగట్టు | సెప్టెంబర్ 5:జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ అంజన్న స్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. శ్రావణ మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేల మంది భక్తులు కొండగట్టుకు తరలివచ్చి అంజన్న స్వామిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. టెంకాయలు, తమలపాకులతో మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానాచార్యులు కపింధర్ స్వామి మాట్లాడుతూ.. శ్రావణ మాసం సందర్భంగా అంజన్న స్వామివారికి చందన అలంకరణ, పంచామృత అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని పేర్కొన్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ఈఓ అంజన్నరెడ్డి, అధికారులు హరిహరనాథ్, సునీల్, రాజేందర్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

👁️ 5 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password