విద్య

జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్‌లో ఆటోక్యాడ్‌పై రెండు రోజుల వర్క్‌షాప్

వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్ ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాథ రాజు

సుల్తాన్‌పూర్ | సెప్టెంబర్ 8:జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సుల్తాన్‌పూర్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విభాగం ఆధ్వర్యంలో ‘డిజైన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ యూజింగ్ ఆటోక్యాడ్’ అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC), హైదరాబాద్ సహకారంతో నిర్వహిస్తున్నారు.ఈ వర్క్‌షాప్‌లో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ డిజైన్‌లో ఆటోక్యాడ్ వినియోగం, ప్రాక్టికల్ డిజైన్ విధానాలు, పరిశ్రమలకు అవసరమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై విద్యార్థులకు నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు సాంకేతిక, పరిశ్రమ ఆధారిత శిక్షణ అందించడంపై దృష్టి సారిస్తోంది

జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్‌లో ఆటోక్యాడ్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థులు

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాథ రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు ఆటోక్యాడ్‌పై ప్రాక్టికల్ పరిజ్ఞానంతో పాటు ఎలక్ట్రికల్ డిజైన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. వై. రాఘవేందర్ రావు మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.EEE విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ వి.బి. శాలిని మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ డిజైన్‌లో ఆటోక్యాడ్ సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు ప్రాక్టికల్ డిజైన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో NSIC హైదరాబాద్ మేనేజర్ డా. టి. ముత్తుకుమారన్, NSIC హైదరాబాద్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ (ECAD) శ్రీ రాబిన్ జేమ్స్ శిక్షణ నిపుణులుగా పాల్గొని విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు.ఈ వర్క్‌షాప్‌ లో EEE విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ వి.బి. శాలిని కన్వీనర్‌గా, బి. ప్రేమ్ కుమార్, వై. అర్చన కోఆర్డినేటర్లు పాల్గొన్నారు

👁️ 8 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password